Saturday, September 23, 2023

9లోగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలి.. లేదంటే…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్లుఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను ఈ నెల 9లోగా అరెస్టు చేయాలని రెజ్లర్లకు మద్దతు ఇస్తున్న రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి ఈ మేరకు శుక్రవారం అల్టిమేటం ఇచ్చారు.

రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ మీడియాతో మాట్లాడుతూ రెజ్లర్ల ఆందోళనను కేంద్రం పరిష్కరించాలని, బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లేని పక్షంలో ఈ నెల 9న రెజ్లర్లతో కలిసి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్దకు వెళ్లి ధర్నా చేస్తామని, దేశవ్యాప్తంగా పంచాయత్‌లను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

అంతేకాకుండా రెజ్లర్లపై పెట్టిన కేసులను విత్‌డ్రా చేసుకోవాలని, బ్రిజ్‌భూషణ్ అరెస్టు జరిగి తీరాలని తికాయత్ స్పష్టం చేశారు. కాగా రైతుల మహాపంచాయత్ ఒత్తిడి వల్లను బ్రిజ్ భూషణ్ అయోధ్యలో ర్యాలీని రద్దు చేసుకున్నారని ఆయన అన్నారు.‘ హర్యానానుంచి కేంద్ర ప్రభుత్వానికి పెదద్ద సందేశం ఇస్తున్నాం. బ్రిజ్ భూషణ్‌పై చరలకు వారం రోజుల సమయం ఇస్తున్నాం ’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News