Friday, March 1, 2024

అవకాశం దొరికిన ప్రతిసారీ వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌భూషణ్ : కోర్టుకు ఢిల్లీ పోలీస్‌ల నివేదిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశాడనీ ఢిల్లీ పోలీస్‌లు ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్టు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. అలాగే , మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బ్రిజ్ భూషణ్‌కు క్లీన్‌చీట్ ఇవ్వలేదనే విషయాన్ని కోర్టులో ప్రస్తావించారు.

ఈమేరకు ఢిల్లీ పోలీస్‌లు కోర్టుకు నివేదిక సమర్పించారు. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు తజకిస్థాన్ వెళ్లిన మహిళా రెజ్లర్లలో ఒకరిని బ్రిజ్ భూషణ్ తన గదికి పిలిచి గట్టిగా కౌగిలించుకున్నాడని, ఆమె ప్రతిఘటించడంతో ఓ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా అలా చేసినట్టు తన చర్యను బ్రిజ్ భూషణ్ సమర్ధించుకున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో అనుమతి లేకుండా తన చొక్కాను పైకెత్తి అసభ్యంగా ప్రవర్తించాడని మరో మహిళా రెజ్లర్ ఫిర్యాదులో పేర్కొన్నారని, ఈ రెండు ఘటనలు బ్రిజ్ భూషణ్ తాను చేస్తున్న చర్యల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఢిల్లీ పోలీస్‌లు కోర్టుకు తెలిపారు.

కొద్ది నెలల క్రితం బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మైనర్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. మరోవైపు బ్రిజ్ భూషణ్ పై మిగిలిన మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్టు కోర్టుకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News