Wednesday, April 17, 2024

సెస్‌పై గులాబీ జెండా

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) ఎన్నికల్లో బిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయఢంకా మోగించారు. పాలకవర్గంలోని మొత్తం 15 డైరెక్టర్ల పోస్టులకు ఎన్నికలు జరగ్గా 14స్థానాల్లో గులాబీ జెం డా ఎగిరింది. బిజెపికి చావుతప్పి కన్ను లొ ట్టపోయినట్లు ఒకే ఒక్క స్థానం దక్కింది. ఈ ఫలితాలను ఎన్నికల అధికారి మమత ప్రకటించారు. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సోమవారం ఓ ట్ల లెక్కింపు పూర్తి చేసిన అనంతరం ఫలితా లు ప్రకటించారు. మంత్రి కెటిఆర్ ప్రచార వ్యూహం ఫలితంగా సెస్‌లో ఉన్న 15 డైరెక్టర్ స్థానాల్లో 14 స్థానాలు బిఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకుని సెస్‌పై గులా బీ జెండాను ఎగురవేశారు.

సోమవారం ప్ర కటించిన ఫలితాల్లో సిరిసిల్ల టౌన్ 1స్థానం నుంచి దిడ్డి రమాదేవి, సిరిసిల్ల టౌన్ 2 స్థానం నుంచి దార్నం లక్ష్మినారాయణ, తంగళ్లపల్లి నుంచి చిక్కాల రామారావు, ఇల్లంతకుంట నుంచి మల్లుగారి రవీందర్‌రెడ్డి, గంభీరావుపేటలో గౌరినేని నారాయణరావు, ముస్తాబాద్ నుంచి సందుపట్ల అంజిరెడ్డి, ఎల్లారెడ్డిపేటలో వరుస కృష్ణమూర్తి , వీర్నపెల్లి నుంచి మాడుగుల మల్లేశం ఎన్నికయ్యారు. చందుర్తి నుంచి పొన్నాల శ్రీనివాసరావు, రుద్రంగిలో ఆకుల గంగారామ్ ఎన్నికయ్యారు. అలాగే కోనరావుపేటలో దేవరకొండ తిరుపతి, వేములవాడ టౌన్ 1 స్థానంలో నామాల ఉమ ఎన్నిక కాగా వేములవాడ టౌన్ 2 స్థానంలో రేగులపాటి హరిచరణ్‌రావు, వేములవాడ రూరల్ స్థానంలో జక్కుల తిరుపతి (బిజెపి బలపర్చిన అభ్యర్థి), బోయినిపెల్లి స్థానంలో కొట్టెపల్లి సుధాకర్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మమత ప్రకటించారు.

వేములవాడ రూరల్ స్థానం విషయంలో కొంత గందరగోళం చోటుచేసుకుంది. దీంతో బిఆర్‌ఎస్, బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగగా రీ కౌంటింగ్ కొనసాగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన చేసిన వారిని అదుపు చేశారు. సెస్‌కు హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో 15 స్థానాల్లో 14ను బిఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకోగా ఒక్కటి మాత్రం బిజెపి బలపర్చిన అభ్యర్థిని వరించింది. కాంగ్రెస్, బిఎస్‌పి తదితర పార్టీల అభ్యర్థులు గట్టి పోటీని ఇవ్వకపోగా వారు ఖాతాను కూడా తెరవకపోవడం గమనార్హం. మంత్రి కెటిఆర్ మంత్రాంగం, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు వ్యూహత్మకంగా ఎన్నికల ప్రచారం సాగించి బిఆర్‌ఎస్ ఘన విజయంతో మరోసారి తమపట్టును నిరూపించారు.

కాగా (నేడు )మంగళవారం సెస్‌కు ఎన్నికైన నూతన డైరెక్టర్లు సమావేశమై నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. కాగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు సెస్ ఎన్నికలు తీవ్ర నిరాశ, నైరాశ్యం కలిగించాయని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా బిఆర్‌ఎస్ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించి టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News