Monday, December 4, 2023

కడియం శ్రీహరికి సంపూర్ణ మద్దతు: రాజయ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో బిఆర్‌ఎస్ నేతలతో ఎంఎల్‌సి పల్లారాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, రాజయ్యతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కెటిఆర్ భరోసా ఇచ్చారు. కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించానని ఎంఎల్‌ఎ రాజయ్య తెలిపారు. బిఆర్‌ఎస్ గెలుపు కోసం కృషి చేస్తానని వివరించారు. సంపూర్ణ మద్దతు ప్రకటించిన రాజయ్యకు కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని కడియం ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి  టికెట్ విషయంలో రాజయ్య-కడియం మధ్య వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే.

Also Read: అంగన్‌వాడీ టీచర్లకు త్వరలో పిఆర్‌సి ఉంటుంది: సత్యవతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News