Friday, April 19, 2024

మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన బిఆర్‌ఎస్ ఎంపీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) వాయిదా తీర్మానాన్ని నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం చర్చ జరపాలని కూడా వారు కోరారు. దీనికి ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత జంతర్ మంతర్ వద్ద ఒక రోజు బైఠాయింపు నిరసన చేపట్టారు. అంతేకాక భారత్ జాగృతి నేతృత్వంలో 15 రాజకీయ పక్షాలు, పౌర సామాజిక సంస్థలు, విద్యార్థి సమూహంతో న్యూఢిల్లీలో ఓ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఎంఎల్‌సి కవిత నిర్వహించారు. కవిత నేతృత్వంలోని భారత్ జాగృతి సంస్థ త్వరలో మహిళా రిజర్వేషన్ బిలులపై ‘మిస్‌డ్ కాల్ క్యాంపెయిన్’ను కూడా ప్రారంభించనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News