Thursday, March 23, 2023

నాందేడ్ లో బిఆర్‌ఎస్ పార్టీ సభకు భారీ ఏర్పాట్లు..

- Advertisement -

హైదరాబాద్: మహారాష్ట్రలోని నాందేడ్ లో ఈ నెల 5న బిఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఇందులో భాగంగా సభాస్థలిలో నిర్వాహకులతో మాట్లాడారు. సభా వేదిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. నాందేడ్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలు, తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున సభకు హాజరుకానున్నారు.

అందువల్ల కట్టుదిట్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. అందరూ సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత పొరుగు రాష్ట్రంలో నిర్వహించనున్న తొలి సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను పటిష్టంగా చేస్తున్నామన్నారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సభకు కూడా
పలువురు జాతీయ పార్టీల నాయకులు పాల్గొంటారని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News