Saturday, September 21, 2024

కవితకు బెయిల్…. బిజెపిలో బిఆర్ఎస్ విలీనం: మహేశ్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎంఎల్‌సి కవితకు బెయిల్ ఊహించిందేని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌సి మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.  బిజెపి, బిఆర్ఎస్ పై విమర్శలు చేసి తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాలో వీడియోను మహేష్ కూమార్ గౌడ్ పోస్టు చేశారు.  బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందన్నారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని రెండు పార్టీలు చూశాయని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి బిఆర్ఎస్ పరోక్షంగా మద్దతు ఇచ్చిందని, బిజెపికి బిఆర్ఎస్ దాసోహంగా మారిందని మహేశ్ కుమార్ ఆరోపణలు చేశారు. హరీష్, కెటిఆర్ లు ఢిల్లీలో బిజెపి నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారని ఎద్దేవా చేశారు. బిజెపి నేతల ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ల కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని విమర్శలు గుప్పించారు. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని, బిజెపి, బిఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని మహేశ్ కుమార్ ధ్వజమెత్తారు. బిజెపిలో బిఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుందని, ఇంకా విలీనం ఒక్కటే మిగిలిందని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News