Tuesday, July 1, 2025

బండ కొట్టే సమయంలో ప్రమాదం…. యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో బండ బ్లాస్టింగ్ లో సమయంలో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బుజిలాపురం గ్రామ ఆర్చి వద్ద బీరప్ప గుడి సమీపంలో ఉన్న ఓ పెద్ద బండ (గుండు)ను మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని కాశవారి గూడెం గ్రామానికి చెందిన వ్యక్తులు పగులకొడుతున్న సమయంలో పెద్ద బండ నాగులు మీరా అలియాస్ ఎస్ కే.సలీం (30) పై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాశవారి గూడెంలో విషాదచాయలు అలుముకున్నాయి. సలీం కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News