Thursday, March 28, 2024

రేసుగుర్రం బుమ్రా రీఎంట్రీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిలీ: టీమిండియా రేసుగుర్రం బుమ్రా నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో తలపడే భారతజట్టులో బుమ్రాకు చోటు లభించింది. గతేడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో చివరిసారి బుమ్రా ఆడాడు. అనంతరం వెన్నెముక గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. స్పీడ్‌స్టర్ బుమ్రా చేరికతో భారత్ పేస్‌దళం బలోపేతం కానుంది. వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో బుమ్రా ఏవిధంగా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. బుమ్రా ఇండియన్స్ తరఫున ఐపిఎల్‌లో గత కొన్నేళ్లుగా కీలకపాత్ర పోషిస్తున్నాడు.

అయితే సెప్టెంబర్ 2022 నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు. వెన్నునొప్పితో ఐసిసి పొట్టి ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ పునరావాసం పొందిన బుమ్రాకు టీమిండియా వన్డే జట్టులో చోటు లభించింది. కాగా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో తలపడే భారతజట్టును మంగళవారం బిసిసిఐ ప్రకటించింది. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరించనుండగా వైస్ కెప్టెన్‌గా హార్దిక్‌పాండ్య భారత్, శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 10నుంచి ఆరంభం కానుంది. గువహటి వేదికగా 10వ తేదీ మంగళవారం ఇరుజట్లు తొలివన్డేలో తలపడనున్నాయి.

భారత్ వన్డే జట్టు: రోహిత్‌శర్మ శుభ్‌మన్ గిల్, విరాట్‌కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), హార్దిక్‌పాండ్య కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్‌పటేల్, బుమ్రా, షమీ, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్‌సింగ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News