Thursday, April 25, 2024

ఉత్కంఠపోరులో భారత్ విజయం..

- Advertisement -
- Advertisement -

ఉత్కంఠపోరులో భారత్ గెలుపు
నాలుగు వికెట్లతో మెరిసిన శివంమావి
బ్యాట్‌తో మెరిసిన దీపక్‌హుడా
తొలి టి20లో 2పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా
ముంబయి: శ్రీలంకతో ముంబయి వేదికగా జరిగిన ఉత్కంఠభరిత తొలి టి20లో భారతజట్టు సత్తా చాటింది. చివరివరకు ఇరుజట్లు మధ్య దోబూచిలాడిన విజయం చివరికు టీమిండియాను వరించింది. తొలి టి2౦లో రెండు పరుగుల తేడాతో టీమిండియా పర్యాటక లంకేయులపై విజయం సాధించింది. భారతజట్టు విజయంలో దీపక్ హుడా 23బంతుల్లో ఓ ఫోరు, నాలుగు సిక్సర్లతో 41పరుగులు, అక్షర్‌పటేల్ 20బంతుల్లో 3ఫోర్లు, ఓ సిక్స్‌తో 31పరుగులు చేసి అజేయంగా నిలిచి మెరిశారు. అనంతరం టీమిండియా బౌలర్ శివం మావి నాలుగు వికెట్ల తీసి టీమిండియా విజయంలో తనవంతు పాత్ర పోషించి అలరించాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దీపక్‌హుడా
టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇషాన్‌కిషన్, గిల్ భారత్ ఇన్నింగ్‌ను ఆరంభించారు. గిల్ 7పరుగులకే తీక్షణ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 37పరుగులతో ఫర్వాలేదనిపించినా శాంసన్ 5పరుగులకే వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచారు. కెప్టెన్ 27బంతుల్లో 29పరుగులు సాధించాడు. 94పరుగులకే 5వికెట్లు కోల్పోయిన టీమిండియాను అక్షర్ పటేల్ 31పరుగులు, దీపక్‌హుడా సాధించి నాటౌట్‌గా నిలిచి ఆదుకున్నారు. మొత్తంమీద నిర్ణీత 20ఓవర్లలో భారత్ 5వికెట్లు కోల్పోయి చేసింది.

అనంతరం నిర్దేశించిన 163పరుగుల లక్ష ఛేదనలో శ్రీలంక 160పరుగులు చేసి ఆలౌటైంది. ఉత్కంఠపోరులో గెలుపు ముంగి చతికలపడింది. దీంతో 2పరుగుల తేడాతో గెలిచిన భారతజట్టు సిరీస్‌లో 10 తేడాతో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. శ్రీలంక కెప్టెన్ షనక చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో శివంమావి నాలుగు వికెట్లుతో ఆకట్టుకోగా ఉమ్రాన్ మాలిక్, హర్షల్‌పటేల్ చెరో రెండు వికెట్లతో అలరించారు. దీపక్‌హుడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News