Friday, April 26, 2024

వరంగల్ లో సిఐ, ఇద్దరు ఎస్‌ఐలు సస్పెండ్…

- Advertisement -
- Advertisement -

వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్.వెంకటేశ్వర్లు, దామెర పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఎ. హరిప్రియ, సుబేదారి ఎస్.ఐ పి.పున్నం చందర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.ఆర్ రంగనాథ్ ఉత్తర్వులు జారీచేశారు. ఇన్‌స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు, ఎస్.ఐ హరిప్రియ ఇరువురు కొద్ది రోజులుగా హద్దులు మీరి వ్యవహరించడంతో మహిళ ఎస్.ఐ భర్త ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం పోలీస్ కమిషనర్ ఇన్‌స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు, మహిళ ఎస్.ఐ హరిప్రియ ఇరువురిని సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వురులు జారీచేసారు.

మరో సంఘటనలో సుబేదారిలో నివాసం వుంటున్న ఓ యువతి గత కొద్ది రోజులుగా లైంగిక వేధింపులు గురికావడంతో రక్షణ కోసం సుబేదారి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పి. పున్నంచందర్‌ను ఆశ్రయించగా సదరు ఎస్.ఐ. నిందితుడిపై కేసు నమోదు చేయకుండా నిందితుడితో రాజీపడాల్సిందిగా బాధితురాలికి ఎస్.ఐ సూచినట్లుగా వచ్చిన పిర్యాదుపై ఎస్.ఐ సుబేదారిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేసారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News