Sunday, October 6, 2024

కేరళకు చెందిన యువ సిఏ ప్రాణం తీసిన పని ఒత్తిడి!

- Advertisement -
- Advertisement -

కొచ్చి: అన్నా సెబాస్టియన్ పెరయిల్(26) కొచ్చిలోని కంగరప్పాడి వాస్తవ్యురాలు. ఆమె పుణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై) లో ఛార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసేది. కానీ అపరిమిత పని ఒత్తిడి తట్టుకోలేక గుండె పోటుతో చనిపోయింది. ఆమె తల్లి అనితా ఆగస్టిన్ సంస్థ చీఫ్ రాజీవ్ మేమానికి రాసిన ఉత్తరంలో తలకు మించిన పని ఒత్తిడి కారణంగానే తన కూతురు చనిపోయిందని పేర్కొంది.  ఈ సమస్య కేవలం తన కూతురుకి ఏర్పడిందే కాదని, దేశంలోని ఐటి ప్రొఫెషనల్స్ అంతా వర్క్ ప్లేస్ లో ఇలాంటి తలకు మించిన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపింది.

ఈవై సంస్థ ‘విచారాన్ని వ్యక్తం’ చేస్తున్నామంది, అన్నా సెబాస్టిన్ అకాల మరణం తమను బాధించిందని పేర్కొంది. తమ సంస్థలో లక్ష మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారందరి బాగోగులకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది. అన్నా తల్లిదండ్రుల కథనం ప్రకారం ఆ యువ చార్టెడ్ అకౌంటెంట్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆమె ఉద్యోగంలో మార్చి 18న చేరింది. అదనపు పని, ఆఫీసు సమయం దాటాక కూడా పనిచేయించడం వంటివి ఆమె అకాల చావుకు కారణమయ్యాయి. అన్నా స్కూల్ లో టాపర్, కాలేజ్ లో టాపర్, ఎక్స్ ట్రా కర్రికులం యాక్టివిటీస్ లో  కూడా అద్వితీయ ప్రతిభ కనబరిచేది. కానీ అధిక పని ఒత్తిడి కారణంగానే  జులై 12న అకాల మరణం పాలయింది.

ఆమె అంతిమ సంస్కారాలకు కూడా కంపెనీ తరఫున ఎవరూ హాజరు కాలేదు. అన్నా మరణానికి కారణం స్ట్రెస్(ఒత్తిడి) అని ఆమె తండ్రి సిబి జోసెఫ్ పెరాయిల్ తెలిపారు. ఆమె చేత నిర్ణీత పనిగంటలకు మించి పనిచేయించేవారని తెలిపారు. ఆగస్టు 14న ఆమె జన్మదినం ఉండగా, దానికి ముందే ఆమె గుండెపోటుతో చనిపోయిందన్నారు. అన్నా ఎస్.ఆర్. బాట్లీబాయ్ టీమ్ లో పనిచేసేది. పని ఒత్తిడి కారణంగా అన్నా అకాల మరణం ఆమె కుటుంబానికి తీరని వ్యథను మిగిల్చింది. ఏ నష్ట పరిహారం కూడా ఆమె కుటుంబానికి కలిగిన తీరని లోటును పూడ్చలేదనే చెప్పాలి. పైగా ఆమెకు ఇచ్చిన పని టాస్క్ కూడా ఆమెది కాదని, అదనంగా అంటగట్టిందని సమాచారం. పనిలో చేరిన నాలుగు నెలలకే ఓ యువ సిఏ మృత్యు వాత పడాల్సి వచ్చింది. ఇదండి మన దేశ వర్క్ కల్చర్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News