Tuesday, April 16, 2024

ఎయిర్ లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

 

 

రంగారెడ్డి: ఎయిర్ లైన్స్ ఉద్యోగినిపై లైంగిక దాడి జరిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎయిర్ పోర్టులో ఓ యువతి విధులు నిర్వహించుకొని గత రాత్రి ఇంటికి వెళ్తున్నప్పుడు శంషాబాద్ బస్టాండ్‌లో నిలబడింది. బస్సు రాకపోవడంతో క్యాబ్‌లో వెళ్లింది. మార్గమధ్యంలో క్యాబ్ డ్రైవర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. డోర్ లాక్ చేసి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. వాహనదారులు అప్రమత్తం కావడంతో క్యాబ్ డ్రైవర్ పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Cab Driver Rape on Air Lines Employee in Shamshabad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News