Saturday, July 27, 2024

పాత వారికే కీలక శాఖలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇప్పుడు కొలువు దీరిన మోడీ మూడవ మంత్రిమండలి శాఖల కేటాయింపులలో ప్ర ధాన మంత్రిత్వశాఖల్లో ఎటువంటి మార్పులే దు. బిజెపి నాయకత్వ మోడీ ప్రభుత్వ పాలసీ కొనసాగింపు క్రమంలో వీటిని మార్చలేదని వెల్లడైంది. ఇక మిత్రపక్షాలకు సరైన పదవులతో వా రిలో ప్రోత్సాహాన్ని కల్పించారు. ప్రాంతీయ స మతూకానికి ప్రాధాన్యత ఇచ్చారని కేబినెట్ శా ఖల స్వరూపాన్ని బట్టి వెల్లడైంది. మంత్రిమండలిలో అత్యంత కీలకమైన నాలుగు మంత్రిత్వశాఖలను ఇంతకు ముందటి ప్రముఖ నేతలకే కట్టబెట్టారు. వీటిలో హోం మంత్రిగా ఇంతకు ముం దటిలాగానే అమిత్ షా కొనసాగుతారు. రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి గా జైశంకర్, అత్యంత కీలకమైన ఆర్థిక మం త్రిగా నిర్మలా సీతారామన్ పదవులు భద్రమయ్యాయి. కాగా ప్రధాని నరేంద్ర మోడీ పర్సన ల్ మంత్రిత్వశాఖ, ప్రజా సమస్యల , పెన్షన్లశాఖతో పాటు అణు ఇంధన, అంతరిక్షవిభాగ శా ఖలను కూడా పర్యవేక్షిస్తారు. ఇక నితిన్ గడ్కరీకి కూడా మునుపటి రహదారులు, రవాణా, హైవేల మంత్రిత్వశాఖ తిరిగి కట్టబెట్టారు. ఆయ న పరిధిలో ఇద్దరు సహాయ మంత్రులు ఉంటా రు. వీరు అజయ్ తంతా, హర్ష్ మల్హోత్రా. 67 సంవత్సరాల నితిన్ గడ్కరీ ఈ శాఖలలో సుదీర్ఘకాలం నుంచి మంత్రిగా పనిచేస్తున్న అనుభవం తో ఉన్నారు. కాగా ఆయన హయాంలో ఇపపటికే పలు విస్తారిత

రహదారుల నిర్మాణ పనులు ఇప్పుడు సాగుతున్నాయి. గడిచిన పది సంవత్సరాలలో దేశంలో అదనంగా 54,858 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించిన ఘనత , కొన్ని ప్రాంతాలలో అత్యాధునిక సాంకేతికత గల రోడ్ల నిర్మాణాలు చేపట్టిన అనుభవం ఉంది. ఆర్థిక మంత్రిత్వశాఖ మోడీ తలపెట్టిన సుసంపన్న భారత్ నిర్మాణ క్రమంలో కీలకమైనది . ఈ క్రమంలో ఇంతకు ముందటి చర్యల్లో జాప్యం జరగకుండా చూసుకునేందుకు తిరిగి నిర్మలా సీతారామన్‌కే ఈ బాధ్యతలు అప్పగించారు. పియూష్ గోయల్ తిరిగి తమ వాణిజ్య శాఖనే నిలబెట్టుకున్నారు. మోడీ తొలి కేబినెట్‌లో ఉన్న జెపి నడ్డాను ఇప్పుడున్న బిజెపి అధ్యక్ష స్థానం నుంచి తప్పించి కేబినెట్‌లోకి తీసుకుని ఆయన ఇంతకు ముందు నిర్వర్తించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖను అప్పగించారు. దీనికి తోడుగా ఆయన రసాయనాలు, ఎరువుల విభాగం కూడా కట్టబెట్టారు. ఇక రైల్వే, సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ బాధ్యతలను అశ్విని వైష్ణవ్‌కు అప్పగించారు. ఇంతవరకూ పౌర విమానయాన మంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియాకు టెలికం మంత్రిత్వశాఖ ఇచ్చారు. కాగా కేబినెట్‌లో అత్యంత యువప్రాయపు మంత్రి అయిన టిడిపికి చెందిన కె రామ్మోహన నాయుడుకు పౌర విమానయాన శాఖ ఇచ్చారు.

ఇద్దరు మాజీ సిఎంలకు కీలక శాఖలు
శివరాజ్‌కు వ్యవసాయం, ఖట్టర్‌కు విద్యుత్
ఇప్పుడు కేబినెట్‌లోకి తీసుకున్న ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు అత్యంత కీలకమైన మంత్రిత్వశాఖలను అప్పగించారు. మధ్యప్రదేశ్‌కు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన అనుభవం ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రధానమైన వ్యవసాయ మంత్రిత్వశాఖ బాధ్యతలు ఇచ్చారు. సంబంధిత రైతు సంక్షేమ , గ్రామీణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలను కూడా ఆయనే చూసుకుంటారు. దేశంలో సుదీర్ఘ రైతుల ఉద్యమం కొన్ని రాష్ట్రాలలో అనేక మలుపులు తిరుగుతున్న దశలో ఈ వ్యవసాయ , రైతాంగ సంక్షేమ శాఖలు అత్యంత కీలకమైనవి. మరో ప్రధానమైన రంగం విద్యుత్ , గృహ నిర్మాణాలు, పట్టణ ప్రాంత వ్యవహారాల శాఖలను హర్యానా దిగ్గజ నేత ఖట్టర్‌కు అప్పగించారు. ఆయనకు ఇద్దరు జూనియర్ మంత్రుల తోడ్పాటు ఉంటుంది. వీరిలో శ్రీపాద్ నాయక్‌కు ఇది రెండో పర్యాయం కాగా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తోఖాన్ సాహూకు తొలిసారి మంత్రిగా ప్రవేశపెట్టారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా రిజిజూ
ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖను కిరెన్ రిజిజుకు కట్టబెట్టారు. ఈ స్థానంలో ఇంతకు ముందు ప్రహ్లాద్ జోషి ఉన్నారు. గతంలో ఎర్త్ సైన్సెస్ , ఫుడ్ ప్రాసిసింగ్ మంత్రిగా ఉన్న రిజిజుకు ఇప్పుడు దక్కింది కూడా కీలకమైనదే. మార్పుల క్రమంలో ప్రహ్లాద్ జోషీని ఆహార, వినియోగదారుల వ్యవహారాలు, పునరుత్పాదక ఇంధన శాఖలకు మార్చారు. సిఆర్ పాటిల్‌ను జల్‌శక్తి మంత్రిత్వశాఖ మంత్రిగా తీసుకున్నారు. భూపేంద్ర యాదవ్‌కు పర్యావరణ మంత్రిత్వశాఖ ఇచ్చారు. గిరిరాజ్ సింగ్‌ను జౌళి శాఖకు మార్చారు. ఈ శాఖను ఇంతకు ముందు ఓడిన స్మృతి ఇరానీ చూశారు. ఇరానీనే ఇంతవరకూ చూసిన స్త్రీ శిశు సంక్షేమ శాఖను ఇప్పుడు అన్నపూర్ణ దేవి, మన్‌సుఖ్ మాండవీయకు కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖను ఇచ్చారు.

రవ్‌నీత్ సింగ్ బిట్టూ ఓడినా మంత్రి పదవి
ఈసారి కేబినెట్‌లో పంజాబ్‌కు చెందిన రవ్‌నీత్ సింగ్ బిట్టూకు ఫుడ్ ప్రాసెసింగ్ సహాయక శాఖ ఇచ్చారు. బిట్టూ పంజాబ్ మాజీ సిఎం , 1995లో హతులైన బియాంగ్ సింగ్ మనవడు. ఈసారి ఎన్నికలలో జూనియర్ బిట్టూ జలంధర్ నుంచి పోటీ చేసి ఓడారు. అయితే మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన ఆరు నెలల వ్యవధిలో ఎంపిగా ఎన్నిక కావల్సి ఉంటుంది. మిత్రపక్షాలలో హామ్ అధినేత , బీహార్ మాజీ సిఎం జితన్ రామ్ మాంజీ మధ్యతరహా సూక్ష్మ చిన్న తరహా సంస్థల మంత్రిత్వశాఖ కట్టబెట్టారు. హెచ్ కుమారస్వామి వ్యవసాయ మంత్రి కావాలనే కలలు కనగా ఆయనకు భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖ అప్పగించారు. ఎల్‌జెపి యువ తేజం చిరాగ్ పాశ్వాన్‌కు ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ అప్పగించారు.

జితేంద్రసింగ్‌కు పలు కిషన్‌రెడ్డికి కీలక గనులు
ఇక మూడోసారి మంత్రి అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూ కశ్మీర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు బహుళశాఖలు ఇవ్వడంతో తీరికలేని మంత్రి కానున్నారు. సైన్స్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, పర్సనల్ , ప్రజా సమస్యలు , పెన్షన్లు అణు ఇంధనం, స్పేస్ శాఖలలో ప్రధానికి తోడ్పాటు అందిస్తారు. ప్రత్యేకించి పిఎంఒ బాధ్యతలు కూడా తీసుకుంటారు. అర్జుర్ రామ్ మేఘ్వాల్ న్యాయం చట్టం వ్యవహారాల శాఖ స్వతంత్ర మంత్రిగా ఉండటంతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి బాధ్యతలు కూడా తీసుకుంటారు. ఈసారి మారిన మంత్రిత్వశాఖలలో తెలంగాణ మంత్రి జి కిషన్ రెడ్డికి అత్యంత కీలకమైన భూగర్భ గనుల మంత్రిత్వశాఖ ఇచ్చారు. ఇంతకు ముందు ఆయన అదనంగా నిర్వర్తించిన హోం శాఖ సహాయ మంత్రి బాధ్యతలను తెలంగాణకే చెందిన బండిసంజయ్‌కు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News