Wednesday, December 6, 2023

కారు, బైకు ఢీ.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హత్నూర: కారు బైకును ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన హత్నూర పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో గల ఎమ్మెన్నార్ పరిశ్రమ సమీపంలో నర్సాపూర్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై సోమవారం చోటు చేసుకుంది.ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నవాబ్ పేట గ్రామానికి చెందిన అవుసలి శ్రీశైలం (39), ఎరుకల రాములు (40) ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై దౌల్తాబాద్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న క్రమంలో ఎమ్మెన్నార్ పరిశ్రమ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న శ్రీశైలం, రాములుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News