Sunday, June 16, 2024

బస్సును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం రాముంతల గడ్డ సమీపంలోని శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో రోడ్డు పైన ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News