Sunday, June 16, 2024

జ్వరేవ్‌తో నాదల్ తొలి పోరు

- Advertisement -
- Advertisement -

జకోవిచ్, ఇగాలకు టాప్ సీడ్
ఫ్రెంచ్ ఓపెన్ డ్రాల ఖరారు

పారిస్: ప్రతిష్ఠాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ డ్రాలను విడుదల చేశారు. మాజీ ఛాంపియన్ రఫెల్ నాదల్ (స్పెయిన్) తొలి రౌండ్‌లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వరేవ్‌తో తలపడనున్నాడు. నాదల్ వరుస గాయాలతో చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌కు ఉన్న రికార్డును దృష్టిలో పెట్టుకుని అతనికి టోర్నీలో ఆడే అవకాశం కల్పించారు. నాదల్ తన కెరీర్‌లో రికార్డు స్థాయిలో 14 ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. ఈ ఏడాది కూడా టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే తొలి రౌండ్‌లోనే అతనికి జ్వరేవ్ రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. జ్వరేవ్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

జ్వరేవ్‌కు ఈసారి నాలుగో సీడ్ లభించింది. ఇలాంటి పరిస్థితుల్లో నాదల్‌కు తొలి రౌండ్ పోరు అతి పెద్ద సవాల్‌గా చెప్పాలి. కానీ ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా ఉన్న నాదల్‌ను తక్కువ అంచనా వేయలేం. ఈసారి అతను ఎలా ఆడుతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు పురుషుల విభాగంలో నొవాక్ జకోవిచ్ (సెర్బియా)కు టాప్ సీడ్ లభించింది. ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ) రెండో సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. స్పెయిన్ సంచలనం కార్లొస్ అల్కరాజ్‌కు మూడో సీడ్ దక్కింది. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. సబలెంకా (బెలారస్)కు రెండో, కొకొ గాఫ్ (అమెరికా)కు మూడో సీడ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News