Tuesday, December 10, 2024

జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ బైపాస్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఆదర్శనగర్‌ మలుపు వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మృతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థాలానికి చేరుకుని పరిశీలించారు.

క్షతగాత్రులను చికత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని కుత్బుల్లాపూర్‌కు చెందిన సురేశ్‌, నరసింహారావుగా పోలీసులు గుర్తించారు.  మహారాష్ట్రలోని గానుగాపూర్‌ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News