Wednesday, March 22, 2023

ఎస్సారెస్పి కెనాల్ లో పడిపోయిన కారు.. యువకుడు మృతి

- Advertisement -

జగిత్యాల: ఎస్సారెస్పి కెనాల్ లో ఓ కారు పడిపోయి యువకుడు మృతి చెందిన ఘటన జిల్లా పట్టణ శివారు ప్రాంతం ధరూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల పట్టణానికి చెందిన ఐదుగురు యువకులు చల్గల్ బైపాస్ నుండి అంతర్గాం మీదుగా జగిత్యాల వస్తున్న క్రమంలో ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో కారు అదుపుతప్పి పడిపోయింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్నబీట్ బజార్ కు చెందిన రిజ్వాన్ అనే యువకుడు కారులోనే చిక్కుకుపోయాడు.

సమాచారం అందుకుని సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతడికి సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేశారు. అనంతరం యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. కాగా, కారులో ప్రయాణిస్తున్న మిగతా యువకులు స్వల్ప గాయలతో క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News