Monday, April 29, 2024

క్యాన్సర్‌పై పోరులో ఘన విజయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతదేశంలో రూపొందించిన క్యాన్సర్ నివారక కార్ టి సెల్ థెరపీ ప్రక్రియ సత్పలితాలు సాధించింది. ఈ థెరపీని వాడిన క్యాన్సర్ రోగి క్యాన్సర్ నుంచి విముక్తి పొందారు. ఈ ప్రక్రియను ఈ రోగికి తొలిసారిగా వాడి పరీక్షించారు. క్యాన్సర్ చికిత్సకు కార్ టి సెల్ చికిత్సను భారతీయ ఔషధ నియంత్రణ సంస్థ ఇటీవలే అనుమతించింది. రోగిలోని క్యాన్సర్ కారక కణాలను జన్యుశాస్త్రవేత్తలు టి సెల్స్‌గా పరిగణిస్తారు. వీటినే చికిత్సకు వాడుకనే ప్రక్రియను కార్ టి థెరపీగా వ్యవహరిస్తారు. ఇది పూర్తిగా జన్యుపరమైన కణజాల చికిత్స ప్రక్రియగా ఉంది. రోగికి చెందిన స్వయం సిద్ధ సహజ రోగనిరోధక కణాలలోని శక్తిని వినియోగించుకని సాగేదే ఈ థెరపీ. ఇదంతా పూర్తిగా జన్యుకణ జాలపు ప్రభావిత అంశాల ప్రాతిపదికన సాగుతుంది. ఈ చికిత్స ప్రక్రియకు భారత ఔషధనియంత్రణ మండలి వాణిజ్యపరమైన ఉత్పత్తి అనుమతిని ఇవ్వడం కీలక పరిణామం అయింది. మనిషిలోని రోగనిరోధక కణాలు అత్యంత శక్తివంతం అయినవి.

వీటితోనే క్యాన్సర్ కారక కణాలను నివారించవచ్చునని తేలిందని నిర్థారించారు. ఢిల్లీకి చెందిన గాస్ట్రో ఎంట్రలాజిస్టు డాక్టర్ కల్నల్ వికె గుప్తా రూ 42 లక్షలు చెల్లించి ఈ చికిత్సను తన శరీరంలో తొలి ప్రయోగంగా నిర్వహింపచేశారు. సాధారణంగా క్యాన్సర్ చికిత్సకు ఇతరత్రా ఈ రోగి విషయంలో రూ 4 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని లెక్కలు కట్టారు. అయితే తక్కువ ఖర్చుతోనే ఈ రోగి నివారణ పొంది క్యాన్సర్ విముక్తి చెందారని వెల్లడైంది. టిసెల్స్‌ను జన్యుపరంగా పరివర్తనం చేయించి వీటిని వాడుకోవడం ద్వారా క్యాన్సర్‌పై విజయం సాధించడం ఇప్పుడు ఈ వ్యాధినివారణ క్రమంలో కీలక మలుపు అయింది. శరీరంలోని ఓ రకం తెల్లటి రక్తకణాలను టి సెల్స్‌గా పిలుస్తారు. శరీరంలో వ్యాధి సోకడాన్ని ఇవి నివారిస్తాయి. ఇప్పుడు ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి (ఐఐటిబి), టాటా మోమొరియల్ హాస్పిటల్ సంయుక్తంగా ఇమ్యూనోయాక్ట్ పద్ధతిలో ఈ నెక్స్‌కార్ 19 పేరిట వ్యవహరించే కణాల చికిత్స ప్రక్రియను రూపొందించింది. ఈ ప్రక్రియతో లూకేమిమా, లింఫోమా వంటి బి సెల్ క్యాన్సర్‌ను నివారించేందుకు వీలుంది.

దేశంలోని పదికి పైగా నగరాలలో 30కి మించి ఆసుపత్రులలో ఈ సరికొత్త థెరపీ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. 15 సంవత్సరాలు పైబడ్డ బి సెల్ క్యాన్సర్ రోగులు ఈ చికిత్స పొందవచ్చు. దేశంలో క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా మారుతోంది. పలు రకాలుగా మారుతోన్న ఆరోగ్య అలవాట్లు జీవనక్రమాలు క్యాన్సర్ పెరుగుదలకు దారితీశాయి. ఈ క్రమంలో అనేక విధాలుగా చికిత్స పద్ధతులు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ఇవన్నీ ప్రామాణికం అని చెప్పడానికి వీల్లేదు. ఈ దశలో అవతరించిన టి సెల్ థెరపీ అత్యంత క్లిష్టం, ఖర్చు ఎక్కువ. ఇతరత్రా ప్రతికూలతలు కూడా ఉంటాయని ఆరంభదశలో గుర్తించారు. అయితే తరువాత జరిపిన పరిశోధనల క్రమంలో మార్పుల తరువాత కార్ టి సెల్ థెరపీ అందుబాటులోకి వచ్చింది. దీనిని నెక్స్‌కార్ 19గా వ్యవహరిస్తున్నారు. తీవ్రస్థాయి బ్లడ్ క్యాన్సర్ నివారణలో కూడా ఇది ఉపయుక్తం అవుతోందని పరిశోధనలలో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News