Wednesday, October 9, 2024

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. అరికెపూడి గాంధీ తనను చంపేందుకు ప్రయత్నించారిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గాంధీతోపాటు ఆయన సోదరుడు, కుమారుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరో మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేష్‌ గౌడ్, శ్రీకాంత్‌ లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ ఆనుచరులు కోడి గుడ్లు, టమాటాలు, రాళ్లలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, పూల కుండీలు ధ్వంసమయ్యాయి. దీంతో గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కౌశిక్ రెడ్డి. అయితే.. అరికెపూడి గాంధీ నివాసానికి వెళ్లి ఆయన ఇంటిపై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ విసరి వివాదానికి తెరలేపారు. ఇదర్దు ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో పొలిటిక్ హీట్ చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News