Tuesday, September 10, 2024

లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కిన ఇడి అధికారి

- Advertisement -
- Advertisement -

ముంబైకు చెందిన ఒక నగల వ్యాపారి నుంచి రూ. 20 లక్షల లంచం పుచ్చుకుంటున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరిని సిబిఐ గురువారం అరెస్టు చేసింది. ఆగస్టు 3, 4 తేదీలలో ఆ నగల వ్యాపారి ప్రాంగణాలలో ఇడి సోదాలు నిర్వహించింది. తనకు రూ. 25 లక్షల లంచం ఇవ్వకపోతే నగల వ్యాపారి కుమారుడిని అరెస్టు చేస్తానని ఇడి అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ యాదవ్ బెదిరించినట్లు సిబిఐ వెల్లడించింది. బేరసారాలు జరపగా రూ. 20 లక్షలకు వారి మధ్య ఒప్పందం కుదిరిందని సిబిఐ అధికారులు తెలిపారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సిబిడిటి) నుంచి ఇడిలో చేరిన యాదవ్‌ను లంచం తీసుకుంటుండగా ప్రత్యక్షంగా పట్టుకున్నట్లు అధికారులు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News