Friday, September 20, 2024

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

- Advertisement -
- Advertisement -

జపాన్‌లోని దక్షిణ తీర ప్రాంతంలో క్యుషు ద్వీపం సమీపంలో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.1 గా నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. 30 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదు కావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. క్యుషు ద్వీపం లోని నిచినాన్, మియాజాకి సమీపంలోని కొన్ని ప్రాంతాలపై భూకంపం ప్రభావం తీవ్రంగా కనిపించింది.

సముద్ర అలలు 1.6 అడుగుల ఎత్తులో ఎగసిపడినట్టు చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ వెల్లడించారు. క్యుషు, షికోకు ప్రాంతం లోని న్యూక్లియర్ రియాక్టర్లు సురక్షితంగానే ఉన్నాయని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ వెల్లడించింది. 2011లో భూకంపంతోపాటు సునామీ సంభవించి పుకుషిమా అణుకేంద్రం దెబ్బతింది. అప్పటి నుంచి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ భద్రత గురించి ఆందోళన చెందడం పరిపాటిగా వస్తోంది. ఈ ఏడాది మొదటి రోజే జపాన్‌లో భూకంపం సంభవించి 200 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News