Saturday, May 4, 2024

టెన్త్, ఇంటర్ విద్యార్థులకు సిబిఎస్ఇ బోర్డు షాక్

- Advertisement -
- Advertisement -

CBSE board

 

హైదరాబాద్ : 10వ తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు సిబిఎస్ఇ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ సంవత్సరం వార్షిక పరీక్షలు రాయడానికి అర్హత సాధించాలంటే 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగానే బోర్డుకు అనుసంధానంగా ఉన్న అన్నిస్కూళ్లు జనవరి 1 వరకు నమోదైన విద్యార్థుల హాజరును లెక్కించనున్నాయి. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో హాజరు తగ్గడానికి సరైన కారణాలు ఉంటే సంబంధిత పత్రాలను జనవరి 7లోగా ప్రాంతీయ కార్యాలయాల్లో సమర్పించాలని సిబిఎస్ఇ బోర్డు ఆదేశించింది. ఈ నిబంధనను అమలు చేయడానికి గల కారణం 2019లో ఆయా తరగతుల ఫలితాలను పరీశీలించగా.. తక్కువ హాజరు కలిగిన వారందరూ పరీక్షల్లో ఫెయిల్, లీస్ట్ స్కోర్ తెచ్చుకున్నట్లు గణాంకాలు నమోదయ్యాయని తెలుస్తోంది. అందుకే దీనిని సరిదిద్దడానికి అన్ని స్కూళ్లు ఖచ్చితంగా 75% హాజరు ఉన్న విధ్యార్థులనే పరీక్షలకు అనుమతించాలని బోర్డు తెలిపింది.

CBSE board shock for Tenth and Inter students
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News