Sunday, November 3, 2024

రైల్వే ప్రమాద బాధిత కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎపి అధ్యక్షుడు తోట చంద్రశేఖర్

మనతెలంగాణ/హైదరాబాద్ : విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి అలమండ సమీపంలో రైలు ప్రమాదం జరగటం దురదృష్టకరమని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. రైల్వే ప్రమాద బాధిత కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని కోరారు. ప్రమాద ఘటనలో మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటీవల కాలంలో దేశంలో రైలు ప్రమాద ఘటనలు పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు.

రైలు ప్రమాదాలు నివారించడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన మరవకముందే మరోమారు రైలు ప్రమాదం జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలున్నా వాటిని సరిదిద్దుకుండా రైల్వే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని దుయ్యబట్టారు. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు తూతు మంత్రంగా తాత్కాలిక చర్యలు చేపడుతున్నారే తప్ప అధికారులు శాశ్వతంగా ప్రమాదాలను నివారించలేకపోతున్నారని పేర్కొన్నారు. రైల్వేలను ప్రైవేట్‌పరం చేసే దుష్ట ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News