Saturday, April 20, 2024

కోచ్.. తూచ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ అన్యాయం చేస్తూనే ఉన్నా రు. తెలంగాణ నుంచి ప్రాజెక్టులను తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు తరలిస్తున్న మోడీ మరోమారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పూర్తిగా విస్మరించారు. తెలంగాణలోని కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్) ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభలో ప్రకటించి మరోమారు కేంద్రం తెలంగాణ పై అక్కసును వెళ్లగక్కింది. రైల్వేల భవిష్యత్ అవసరాలకు సరిపోయే కోచ్‌ల తయారీ సామ ర్థ్యం ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీలకు ఉందని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఎంపి కె.ఆర్. సురేష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వై ష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని దీనికోసం అవసరమైన భూమిని కేటాయించామని పలుమార్లు తెలంగాణ చేసిన అభ్యర్థనలు బుట్టదాఖలు చేయడం గమనార్హం.
మహారాష్ట్ర, అస్సాంలో ఏర్పాటు
ప్రస్తుతం కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని తేల్చి చెప్పిన కేంద్రం ఎనిమిదేళ్లలో రెండు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను మంజూరు చేసింది – ఒకటి మ హారాష్ట్రలోని లాతూర్‌లో రూ. 625 కోట్లతో మరఠ్వాడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మోడీ ప్రభుత్వం శం కుస్థాపన చేశారు. మరొకటి అస్సాంలోని కోక్రాజార్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైల్ కోచ్ ఫ్యాక్టరీ మంజూరులో తెలంగాణ పట్ల కేం ద్రం చూపుతున్న వివక్షపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్, మంత్రి కెటి రామారావు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు హామీ ఇచ్చిన కాజీపేట రైల్‌కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు నిరాకరిస్తున్నారో దానిపై తెలంగాణకు చెందిన బిజెపి ఎంపీలు లేదా కేంద్ర మంత్రి ఎవరైనా వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.

ఇదిలావుండగా తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఇచ్చే ప్రసక్తేలేదంటూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పడంపై తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చట్టబద్దంగా రావాల్సినవి కూడా ఇవ్వకుండా, విభజన చట్టంలోని అంశాలను పట్టించుకోకుండా కేంద్రంలోని మోడీ సర్కారు రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాకముందు నుంచి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలిత రాష్ట్రమైన అస్సాంకు ఇటీవలే కోచ్ ఫ్యాక్టరీ, మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కు ఓ రైల్వే ప్రాజెక్టును ప్రకటించి తెలంగాణకు మాత్రం రిక్తహస్తం చూపడంపై బిజెపి ఎంత పక్షపాత వైఖరితో పనిచేస్తోందో మరోసారి స్పష్టమైందన్నారు. రాష్ట్రంలో ఉన్న ఓ కేంద్రమంత్రి, ముగ్గురు ఎంపిలు దద్దమ్మలు కాబట్టే తెలంగాణకు కేంద్రం కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News