Thursday, May 9, 2024

సుప్రీంకోర్టు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ నియంత్రణ యంత్రాంగాలను పటిష్టం చేసేందుకు డొమైన్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని,  హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం అదానీ స్టాక్స్ పతనానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. అయితే కమిటీకి డొమైన్ నిపుణుల పేర్లను, దాని ఆదేశం పరిధి వివరాలను సీల్డ్ కవర్‌లో ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా ఇప్పుడు నెలకొన్న పరిస్థితిని ఎదుర్కోవడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ, ఇతర చట్టబద్ధమైన సంస్థలు సన్నద్ధమయ్యాయని కేంద్రం, సెబీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
‘కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పరిధిని మేము నిర్ణయిస్తాము. పేర్లను సీల్డ్ కవర్‌లో ఇస్తాము’ అని లా ఆఫీసర్ తెలిపారు. సంఘం(ప్యానెల్) ఏర్పాటుపై ఏదైనా అనుకోని సందేశం వచ్చినా అది డబ్బు రాకపై ప్రతికూలం ప్రభావం చూపగలదని మెహతా అన్నారు.

సర్వోన్నత న్యాయస్థానం రెండు ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలను(పిల్స్) విచారణకు స్వీకరించింది. అమాయకులైన పెట్టుబడిదారులను దెబ్బతీశారని, ప్రధానంగా అదానీ గ్రూప్ స్టాక్స్ విలువ కృతిమంగా పతనమయ్యేలా చేసి శుక్రవారం కుప్పకూలిపోయేలా చేశారన్న ఆరోపణలపై ఆ పిల్స్ దాఖలయ్యాయి.

అదానీ కంపెనీల షేర్ల పతనం, మార్కెట్ హెచ్చుతగ్గుల నేపథ్యంలో భారతీయ మదుపరుల ప్రయోజనాలను కాపాడాల్సి ఉందని ఫిబ్రవరి 10న పేర్కొంది. అంతేకాక మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో డొమైన్ ఎక్స్‌పర్ట్‌లతో ప్యానెల్‌ను ఏర్పాటుచేసే విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. రెగ్యులేటరీ మెకానిజంను పటిష్టం చేయాలని సూచించింది.
దేశంలో మూలధనం రాకపోకలు అంతులేకుండా ఉన్నందున పటిష్టమైన యంత్రాంగాన్ని ఎలా ఏర్పాటు చేయాలనే దానిపై సెబీ, కేంద్రం అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News