Monday, October 14, 2024

అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున జైలులో చంద్రబాబు దీక్ష: అచ్చెన్నాయుడు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున జైలులో చంద్రబాబు దీక్ష చేస్తారని ఎపి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏ తప్పు చేయని చంద్రబాబు తనకి జరిగిన అన్యాయంపై గాంధీ జయంతి రోజున దీక్ష చేస్తారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గూబ గుయ్ మనేలా తెలుగు ప్రజలు మోతమోగించారని తెలిపారు. 22 రోజులుగా చంద్రబాబుని అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు.

ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పి చంద్రబాబుని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఉక్కుపాదంతో టిడిపి నిరసనను అణిచివేయాలని చూసినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని వెల్లడించారు. ఏ తప్పూ చేయని చంద్రబాబుని ఎందుకు జైల్లో పెట్టారని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News