Wednesday, May 8, 2024

చంద్రయాన్-3 దిగిన ప్రదేశం ఇక శివ్ శక్తి పాయింట్: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం అయినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అభినందించారు. సైన్స్‌ను, భవిష్యత్తును విశ్వసించే ప్రపంచ ప్రజలందరూ భారత్ సాధించిన విజయం పట్ల ఉత్సాహంతో ఉన్నారని ప్రధాని అన్నారు.

గ్రీన్ పర్యటన ముగించుకుని నేరుగా బెంగళూరులో దిగిన ప్రధాని మోడీ ఇస్రో చేరుకుని శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్(ఇస్ట్రాక్) చేరుకునే ముందు ఆయన హెచ్‌ఎఎల్ ఎయిర్‌పోర్టు వెలుపల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఆగస్టు 23న చంద్రుడిపై విక్రమ్ దిగిన ప్రదేశాన్ని శివ్ శక్తి పాయింట్‌గా వ్యవహరించనున్నట్లు ప్రధాని తెలిపారు. చంద్రయాన్ తన పాదముద్రలను వేసిన ప్రదేశాన్ని తిరంగా అని పిలుస్తామని ఆయన చెప్పారు. ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పాటించనున్నట్లు ఆయన ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News