Monday, April 29, 2024

ప్రధాని పాలమూరు పర్యటనలో స్వల్ప మార్పు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహబూబ్‌lనగర్ షెడ్యూల్‌lలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముందస్తూ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న ఉదయం 11: 20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 2:15 గంటల వరకు హైదరాబాద్‌lలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

అనంతరం మధ్యాహ్నం 2:25 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 3:05 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుంటారు. అయితే తాజా షెడ్యూల్ ప్రకారం.. బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాక నేరుగా ప్రధాని మోడీ మహబూబ్ నగర్ చేరుకుంటారు. హైదరాబాద్‌లో ఎక్కడా ఆగకుండా డైరెక్టుగా మహబూబ్ నగర్ చేరుకుంటారు. మోడీ షెడ్యూల్ ను ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News