Thursday, July 31, 2025

వరుస ప్రమాదాలు.. హెలికాప్టర్ సేవలపై నిషేధం

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: చార్ ధామ్ యాత్ర మార్గంలో వరుస హెలికాప్టర్ల ప్రమాదాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ యాత్ర సందర్భంగా ఇటీవల కాలంలో హెలికాప్టర్ల ప్రమాదాలు, అత్యవసర ల్యాండింగ్‌ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కేదార్‌నాథ్ సమీపంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మరణించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హెలికాప్టర్ సేవలను నియంత్రించడానికి, సురక్షితంగా నిర్వహించడానికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. హెలికాప్టర్ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సిఎం.. చార్ ధామ్ ప్రాంతంలో హెలికాప్టర్ కార్యకలాపాలపై అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సమన్వయంతో ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (UKADA) హెలికాప్టర్ సేవలపై తాత్కాలికంగా నిషేధాన్ని విధించింది. భద్రతా ప్రోటోకాల్‌లను క్షుణ్ణంగా సమీక్షించి, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News