Saturday, September 21, 2024

ఎంఎస్ ధోనీపై చీటింగ్ కేసు!

- Advertisement -
- Advertisement -

ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ సారధి, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తి ధోనీ తనను రూ.15 కోట్లు మోసగించాడని బిసిసిఐకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిన ఈనెల 30 వరకూ గడువు ఇచ్చింది. యుపికి చెందిన రాజేశ్ కుమార్ మౌర్య ధోనీ తనను రూ.15 కోట్లు మోసం చేశాడని బిసిసిఐ ఎథిక్స్ కమిటీకి ఆదివారం ఫిర్యాదు చేశాడు. బిసిసిఐ నిబంధన 36 ప్రకారం కేసు నమోదు చేసుకున్న బిసిసిఐ మిహిరా దివాకర్ అనే వ్యక్తిపై ధోనీ పెట్టిన రూ.15 కోట్ల కేసుకు దీనికి సంబంధం ఉంది. దాంతో, ధోనీని రాజేశ్ కుమార్ నమోదు చేసిన ఫిర్యాదుపై స్పందించాల్సింది కోరింది. కాగా, 2021 సంవత్సరంలో ధోనీపై పేరుపై అకాడమీ నడిపేందుకు అర్క్రా స్పోర్ట్ మేనేజ్‌మెంట్ ధోనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అగ్రీమెంట్ ప్రకారం ధోనీకి రావాల్సిన రూ.15 కోట్లు ఇవ్వలేదు. ఆ కంపెనీ యాజమాని సౌమ్యదాస్ ధోనీకి దాదాపు రూ.15 కోట్లు టోకరా పెట్టాడు. దీనిపై మాజీ సారధి రాంచీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు రాజేశ్ కమార్ ధోనీపై తమను మోసగించాడని బిసిసిఐ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News