- Advertisement -
బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆడిన 10 మ్యాచులలో 2 మ్యాచులలో మాత్రమే విజయం సాధించిన చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశం కోల్పోయింది. కనీసం చివరి మ్యాచుల్లో అయినా.. మంచి ప్రదర్శన చేసి పరువు నిలబెట్టుకోవాలని చెన్నై భావిస్తోంది. మరోవైపు ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆర్‌సిబి.. ఈ మ్యాచ్‌లో గెలిచి.. పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానం దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గత మ్యాచ్‌లోని జట్టుతోనే బరిలోకి దిగుతుండగా.. బెంగళూరు జట్టులో ఒక మార్పు చేసింది. జోష్ స్థానంలో ఎంగిడిని జట్టులోకి తీసుకుంది.
- Advertisement -