Saturday, December 7, 2024

చెస్ క్రీడాకారులకు భారీ నజరానా

- Advertisement -
- Advertisement -

చెన్నై: మహాబలిపురం వేదికగా జరిగిన ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్‌లో పతకాలు సాధించిన భారత పురుషులు, మహిళా జట్లకు తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. చెస్ ఒలింపియాడ్‌లో పురుషుల విభాగంలో భారత్‌బి, మహిళల విభాగంలో ఇండియాబి టీమ్ కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఇక భారత జట్లకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోటి రూపాయల చొప్పున నగదు పారితోషికాన్ని ప్రకటించారు. రెండు జట్లకు చెరో కోటి రూపాయల నగదు బహుమతిని ఇస్తున్నట్టు స్టాలిన్ తెలిపారు. ఇక భారత్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు పాల్గొన్నాయి. ప్రారంభోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Chess Olympiad: Tamil Nadu Govt Rs 1 crore to 2 Teams

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News