Saturday, April 20, 2024

క్యాన్సర్ వ్యాధి నుంచి తప్పించుకున్నా: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

తాను క్యాన్సర్ బారిన పడేవాడినని, కానీ ముందస్తు చికిత్స చేయించుకోవడం ద్వారా ఆ మహమ్మారి బారి నుంచి తప్పించుకోగలిగానని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. క్యాన్సర్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని.. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే అది తగ్గిపోతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ క్యాన్సర్ సెంటర్ ఓపెనింగ్‌కు చిరంజీవి హాజరయ్యారు.

ఈ సెంటర్ ప్రారంభోత్సవం అనంతరం మెగాస్టార్ మాట్లాడుతూ ఒక వయస్సు వచ్చిన తర్వాత కొన్ని టెస్ట్‌లు చేయించుకునే క్రమంలో క్యాన్సర్‌ను గుర్తించి సరైన చికిత్స తీసుకున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం.. నార్మల్ చెకప్ కోసం ఏఐజీలో కొలనో స్కోపీ చేయించుకోవడానికి వెళ్లాను. అప్పుడు కొన్ని పాలిబ్స్ ఉన్నట్లుగా డాక్టర్స్ గుర్తించి తొలగించారు. అవి ముదిరితే మాత్రం క్యాన్సర్ బారిన పడేవాడినని డాక్టర్లు చెప్పారు. క్యాన్సర్‌పై నిర్లక్ష్యం చేస్తే మాత్రం చావుని కొనితెచ్చుకున్నట్లే.

చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా క్యాన్సర్‌ని నివారించుకోవచ్చు. నా అభిమానులకు, సినీ కార్మికులకు కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయించడానికి నా వంతు సహకారాన్ని అందిస్తాను. హైదరాబాద్‌లోనే కాకుండా ప్రతి జిల్లాల్లోనూ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు జరిపితే.. అందుకు అయ్యే ఖర్చు నేను భరిస్తాను. హైదరాబాద్ క్యాన్సర్ నియంత్రణకు హబ్ కావాలి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News