Wednesday, May 29, 2024

సిఎఎ కింద మొదటి సెట్ పౌరసత్వం సర్టిఫికేట్లు పంపిణీ

- Advertisement -
- Advertisement -

అందుకున్న 14 మంది
హోమ్ శాఖ కార్యదర్శి భల్లా అందజేత
న్యూఢిల్లీ : పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) కింద మొదటి సెట్ పౌరసత్వం సర్టిఫికేట్లను బుధవారం 14 మంది వ్యక్తులకు జారీ చేశారు. కేంద్రం నిబంధనలు రూపొందించిన సుమారు రెండు నెలల అనంతరం ఆ సర్టిఫికేట్ల పంపిణీ జరిగింది. సిఎఎ కింద పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లలో మతపరమైన కారణాలతో వేధింపులకు గురైన, 2014 డిసెంబర్ 31 లోపు భారత్‌కు వచ్చిన మైనారిటీలు భారత్‌లో పౌరసత్వం పొందవచ్చు.

వారిలో హిందువుల, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు ఉన్నారు. సిఎఎను పార్లమెంట్ ఆమోదించిన నాలుగు సంవత్సరాల అనంతరం మార్చి 11న కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ నిబంధనల నోటీఫికేషన్ జారీ చేసింది. 14 మంది వ్యక్తుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చేసిన తరువాత వారు బుధవారం పౌరసత్వం సర్టిఫికేట్లు అందుకున్నారు. కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వారికి సర్టిఫికేట్లు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News