Monday, June 10, 2024

జూన్ 4 తరువాత మోడీ ప్రధానిగా ఉండరు

- Advertisement -
- Advertisement -

రాహుల్ గాంధీ ఉద్ఘాటన
‘ఫేక్’వీడియో పంచుకున్న నేత
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన ‘అబద్ధాల’ ద్వారా తనను తాను ఎంతగా సంతృప్తిపరచుకున్నా అది ఏమాత్రం తేడా చూపించబోదని, నరేంద్ర మోడీ జూన్ 4 తరువాత ప్రధానిగా ఉండబోరని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం ప్రకటించారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పొందుపరచిన ఒక వీడియోను రాహుల్ పంచుకునానరు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో తాను చేసిన వ్యాఖ్యలను ఏవిధంగా ‘వక్రీకరించారో’, నిజం, అబద్ధాల మధ్య తేడా చూపించారో ఆ వీడియో స్పష్టం చేసింది.

‘బిజెపి ‘అబద్దాల ఫ్యాక్టరీ’ ద్వారా తనను తాను ఎంతగా సంతృప్తి పరచుకున్నా అది ఏమాత్రం తేడా తీసుకురాదు. జూన్ 4 తరువాత నరేంద్ర మోడీ ఇక ఎంత మాత్రం ప్రధానిగా ఉండరని నేను మళ్లీ చెబుతున్నాను’ అని రాహుల్ ‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో తెలిపారు. ‘దేశంలో ప్రతి మూల ఇండియాకు అనుకూలంగా పెనుగాలి వీస్తోంది’ అని రాహుల్ ప్రతిపక్ష కూటమిని దృష్టిలో పెట్టుకుని అన్నారు. ఇండియా కూటమి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి అధికార చ్యుతి కలుగుతుందని కాంగ్రెస్‌తో పాటు రాహుల్ జోస్యం చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News