హైదరాబాద్: పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండకు భారత సైన్యం బుధవారం రాత్రి ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ పేరుతో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే భారత్‌లో కూడా ప్రతిదాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్‌డ్రిల్ జరిగాయి.
ఈ నేపథ్యంలో మరికాసేపట్లో హైదరాబాద్‌లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరగనుంది. వైమానిక దాడులపై ప్రజల్లో అవగాహన కల్పించేలా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకూ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీస్ సైరన్, ఇండస్ట్రియల్ సైరన్లు మోగనున్నాయి. సైరన్లు మోగినప్పుడు ప్రజలంతా ఇండ్లల్లోనే ఉండాలని, రోడ్లపై ఉన్నవాళ్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. 1971 పాక్‌తో యుద్ధం జరిగినప్పుడు దేశవ్యాప్తంగా.. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు అసోంలో మాక్‌డ్రిల్ నిర్వహించారు.