Monday, June 17, 2024

పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామన్నారు:కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల అనంతరం పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బెదరించారని, దేశం నియంతృత్వంలో ఉందని ఇది సూచిస్తోందని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సోమవారం ఆరోపించారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం లూధియానాలో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, పంజాబ్‌లో బిజెపి లోక్‌సభ అభ్యర్థుల విజయాన్ని సాధ్యం చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘బిజెపి విజయం అనంతరం భగవంత్ మాన్ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగదు’ అని ఆయన సూచించారు. కేజ్రీవాల్ సోమవారం అమృత్‌సర్‌లో వర్తకుల సమావేశంలో ప్రసంగిస్తూ, ‘అమిత్ షా మాటలను మీరు విన్నారా? ఆయన ఒక హెచ్చరిక చేశారు. ఆదిలో ఆయన పంజాబీలను దూషించారు. జూన్ 4 తరువాత పంజాబ్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామనిఆయన బెదరించారు. భగవంత్ మాన్ జూన్ 4 తరువాత ఎంతో కాలం ముఖ్యమంత్రిగా కొనసాగరు’ అని చెప్పారు.

‘మాకు 92 సీట్లు ఉన్నాయి. మీరు ఎలా (ప్రభుత్వాన్ని) కూలగొడతారు? (దేశంలో) నియంతృత్వం ఉంది’ అని కేజ్రీవాల్ అన్నారు. సిబిఐ, ఇడితో శాసనసభ్యులను బెదరిస్తామని, వారిని ‘కొంటామని’ బిజెపి నేతలు బాహాటంగానే చెబుతున్నారని ఆయన ఆరోపించారు. కాగా, అమిత్ షా వ్యాఖ్యలను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గర్హించారు. ‘ప్రభుత్వాన్ని కూల్చే ధైర్యం మీకు ఉందా? మాకు 92 సీట్లు ఉన్నాయి. మీరు మమ్మల్ని బెదరిస్తున్నారు. మీరు (ఇక్కడికి) వస్తున్నది వోట్లు కోరడానికా లేక ప్రభుత్వం కూల్చివేతకు బెదరించడానికా?’ అని మాన్ అన్నారు. కేజ్రీవాల్ అమృత్‌సర్‌లో ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడుతూ, నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం సమస్యలపై ఆయన మౌనం దాల్చారని ఆరోపించారు. ‘ఇండియా కూటమి (ప్రజల) గేదెలు, మంగళసూత్రాలను లాక్కొంటుందని ఆయన (మోడీ) చెబుతున్నారు’ అని కేజ్రీవాల్ విమర్శించారు. ప్రధాని ప్రజల సమస్యలపై మాట్లాడాలని కేజ్రీ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News