Monday, June 17, 2024

ఎడియూరప్పపై కేసు పెట్టిన మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

తన మైనర్ కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినారంటూ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు బిఎస్ ఎడియూరప్పపై ఆరోపణలు చేసిన ఒక మహిళ ఆదివారం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. 54 ఏళ్ల ఆ మహిళ ఊపిరితిత్తుల సమస్యతో ఆగ్నేయ బెంగళూరులోని హులిమవు పోలీసు స్టేషన్ పరిధిలోని నానో ఆసుపత్రిలో ఆదివారం(మే 26) మరణించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు వర్గాలు తెలిపాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆ మహిళ ఆసుపత్రిలో చేరారని, చికిత్స పొందుతూ మరనించారని వారు చెప్పారు. మృతురాలికి ఒక 17 ఏళ్ల కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

గతంలో తమపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి నష్ట పరిహారం కోరేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 2న డాలర్స్ కాలనీలోని ఎడియూరప్ప నివాసినిక వెళ్లగా తన మైనర్ కుమార్తెపై లైంగిక దాడికి ఆయన పాల్పడినట్లు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సదాశివనగర్ పోలీసు స్టేషన్‌లో మార్చి 14న ఎడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అనంతరం ఈ కేసును సిఐడికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సిఆర్‌పిసిలోని సెక్షన్ 64 కింద ఆ మహిళతోపాటు ఆమె కుమార్తె వాంగ్మూలాన్ని సిఐడి నమోదు చేసింది. అయితే తనపై ఆ మహిళ చేసిన ఆరోపణలను ఎడియూరప్ప ఇదివరకే ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News