Saturday, September 21, 2024

ఇద్దరు సిఎంలదీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని త్వరలోనే ని యమిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చెప్పారు. ఈసారి యువ నేతకు అవకాశం ఇచ్చి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. శనివా రం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు విచ్చేసిన చంద్రబాబునాయుడుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆయన రా కతో ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కి భారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాం గణమంతా పసుపుమయంగా మారింది. అంతకుముందు చంద్రబాబునాయుడు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ట్రస్ట్ భవన్‌కు టీటీడీపీ నేతలతో కలిసి ర్యాలీగా బయలుదేరి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన త ర్వాత రెండోసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చంద్రబా బు విచ్చేశారు. టిటిడిని ముఖ్య నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు తదితరులతో చంద్రబాబు భేటీ అయ్యారు.

ఈ సందర్భం గా పలు కీలకాంశాలను చర్చించారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని అన్నారు. మరో మూడు వారాల్లో సభ్యత్వ నమోదు కూడా ఉంటుందని వెల్లడించారు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయామని వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తానని అన్నారు. కొన్ని కారణాల వల్ల తెలంగాణలో పార్టీ బలహీనపడిందని చెబుతూ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ముందుకెళతామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. గ్రామాల్లోని క్యాడర్ ను సమన్వయం చేసుకుంటూ నేతలు ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలోపేతం అంశంపైనా చర్చించినట్లు తెలిపారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే 15-20 రోజుల్లో సభ్యత్వాల నమోదు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు సూచనప్రాయంగా చంద్రబాబు తెలిపారు. సభ్యత్వాల నమోదు పూర్తయ్యాకే కమిటీలు ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. తెలంగాణలో టిడిపిని అగ్రస్థానానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణలో ఒకప్పుడు బలమైన పార్టీగా టిడిపి ఉందని, కొన్ని పరిస్థితుల్లో బలహీనబడిందని చెబుతూ తిరిగి పార్టీకి పునర్‌వైభవం తీసుకువస్తామని వివరించారు. తెలుగు వారి కోసం తెలంగాణలో పుట్టిన పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. పార్టీలోకి వచ్చి పని చేస్తామని చాలా మంది ముందుకు వస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇప్పటికీ పది శాతం ఓటు బ్యాంకు
తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి పది శాతం ఓటు బ్యాంక్ అలాగే ఉందని చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఎక్కువ మంది సూచించినట్లు తెలిసింది. తొలుత తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిని ఎన్నుకోని ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయడంపై నేతలతో చంద్రబాబు నాయుడు చర్చించారని చెబుతున్నారు. అలాగే టీటీడీపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయం కూడా సేకరించారు. అయితే ఈసారి అధ్యక్ష బాధ్యతలు యువనేతకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇది నిజం కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో చాలా కాలంగా సేవలందిస్తున్న వారిలో ఎవరో ఒక సీనియర్ నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. టిటిడిపి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో సీనియర్ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నరసింహులు, నందమూరి సుహాసిని, సామా భూపాల్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News