Friday, April 26, 2024

సీఎం పర్యటన విజయవంతం చేయాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 7 సీఎం జగిత్యాల పట్టణ పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్‌లు, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత, స్థానిక శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జి రవి, ఎస్పీ సింధు శర్మలతో పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ శాఖల అధికారులతో ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సిఎం పర్యటన ప్రభుత్వ శాఖలు తమకు అప్పగించిన బాధ్యతలను చిత్త శుద్దితో నిర్వర్తించాలని అన్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చాడాలని కోరారు. సిఎం పర్యటన పూర్తి అయ్యేవరకు విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్‌కో అధికారులు చాడాలన్నారు.

ఈ కార్యక్రమంకు హాజరయ్యే ప్రజా ప్రతినిధులకు సంబందిత శాఖల జిల్లా అధికారులకు సకాలంలో పాస్‌లు అందజేయాలని సూచించారు. అలాగే అగ్నిమాపక శాఖ, అగ్నిమాపక శకటాలను సిద్దంగా ఉంచాలన్నారు. సిఎం పర్యటనకు అంబెలెన్స్‌ను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ అరేంజ్మెంట్‌లు రెవెన్యూ అధికారులు చాడాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News