Thursday, April 25, 2024

దశాబ్ది ఉత్సవాలపై కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశా నిర్దేశం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అవతర దశాబ్ది ఉత్సవాలపై సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశం నిర్వహించారు. ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ.. స్వరాష్ట్రంలో అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని… అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏరోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం సూచించారు. గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సీఎం వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గాను కలెక్టర్లకు రూ.105 కోట్ల నిధులు విడుదల చేస్తూ సిఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్లు, ఎస్పీలతో సిఎం కెసిఆర్ గ్రూప్ ఫోటో

CM KCR Review meeting with Collectors

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణపై నిర్వహించిన సమావేశం ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి సిఎం కెసిఆర్ గ్రూప్ ఫోటో దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News