Wednesday, March 29, 2023

నేడు కామారెడ్డికి సిఎం కెసిఆర్..

- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కుర్ మండలం తిమ్మాపూర్‌లో తెలంగాణ తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని సీఎం కార్యాలయ అధికారులు కామారెడ్డి జిల్లా అధికారులకు సమాచారం పంపారు.

సిఎం నేడు ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలు దేరి ఉదయం 10.40 గంటలకు బాన్సువాడకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిమ్మాపూర్‌లోని తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో కెసిఆర్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సిఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News