Wednesday, April 24, 2024

CM KCR: రైతన్నల కన్నీళ్లు తుడిచేందుకే కదలివచ్చా: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : ఈదురు గాలుల బీభత్సం…అకాలంగా కురిసిన వడగండ్ల వానతో పంటలు నష్టపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతన్నల కన్నీళ్లు తుడిచేందుకే తాను ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి రైతుల కాడికి కదిలివచ్చానని సిఎం కెసిఆర్(CM KCR) తెలిపారు. పెద్దవంగర మండలంలోని రెడ్డికుంట తండా, పోచారం, వడ్డేకొత్తపల్లి, బొమ్మకల్ గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించిన పంట క్షేత్రాలు మిర్చి, మొక్కజొన్న, మామిడి తోటలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao), రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లతో సిఎం కెసిఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అధికంగా మిర్చి తోటలో నష్టపోయిన రైతు జాటోతు పెద్ద సోమ్లానాయక్, మొక్కజొన్న రైతు జాటోతు చిన్న సోమ్లానాయక్, మామిడి తోట రైతు జాటోతు నెహ్రునాయక్‌లతో పాటు పలువురు రైతుల పంటలు బలమైన ఈదురుగాలులు, అకాల వర్షాలు, వడగండ్ల వానలతో చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడంతో సీఎం కేసీఆర్ స్వయంగా పలుకరిస్తూ ఓదార్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ భూమిని నమ్ముకొని పంటలు పండిస్తూ దేశానికే అన్నం పెట్టే రైతన్నలు అధైర్యపడవద్దని, అన్నదాత ఆగమైతే దేశమే అధోగతి పాలవుతుందన్నారు. పంటలు నష్టపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులందరినీ రాష్ట్ర ప్రభుత్వం కంటి పాపలు, కన్నబిడ్డల వలే కాపాడుకుంటుందని హామీ ఇచ్చారు.
తానే స్వయంగా రైతు బిడ్డనని, రాష్ట్ర మంత్రి వర్గమంతా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారేనని, పంటలు కోల్పోయిన రైతుల బాధలు ఎలా ఉంటాయో తమకు పూర్తిగా తెలుసని అన్నారు. అందుకే మీకు ధైర్యం చెప్పడానికి వచ్చానని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన తరువాత రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమం వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం నిత్యం కోట్లాది రూపాయల వ్యయంతో అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రైతాంగానికి ఉచితంగా సాగుజలాలు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పంటల పెట్టుబడి సహాయం, రైతు బీమా, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతూ రైతుల ఉన్నతికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పనితీరు సహకారాల కారణంగానే తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్‌ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందుతోందని, దేశ జీడీపీలో సైతం రాష్ట్ర వ్యవసాయ రంగం భాగస్వామిగా మారుతుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News