Wednesday, October 9, 2024

ముగిసిన మమత ,డాక్టర్ల చర్చలు

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమత బెనర్జీకి, సమ్మెలో ఉన్న డాక్టర్లకు మధ్య సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. సోమవారం సాయంత్రం సిఎం అధికారిక కాళిఘాట్ నివాసంలో మొదలైన చర్చలు రాత్రి పది గంటల వరకూ సాగాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులకు భద్రత విషయంపై ప్రభుత్వం చర్యలకు ముందుకొచ్చింది. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడలేదు. ఇప్పటికిప్పుడు ఇవి ఫలించాయని చెప్పలేమని స్థానిక అధికారి ఒకరు ఆ తరువాత విలేకరులకు తెలిపారు. డాక్టర్ల న్యాయం కోసం నినాదాల నడుమ సిఎం నివాసంలో చర్చల వివరాలను రికార్డు చేశారు. ఆర్‌జి కార్ ఆసుపత్రిలో లేడీ డాక్టర్ పై హత్యాచార ఘటన తరువాత డాక్టర్లు నిరసనగా సమ్మెకు దిగారు. ఈ దశలో సిఎంకు, డాక్టర్ల బృందానికి మధ్య చర్చల ప్రక్రియ జాప్యం అవుతూ వచ్చింది. చివరికి సోమవారం డాక్టర్ల బృందం పెద్ద సంఖ్యలోనే సిఎం నివాసానికి చేరింది.

జూనియర్ డాక్టర్లు ఆసుపత్రులలో తమకు డ్యూటీవేళల్లో కనీస మౌలిక సదుపాయాలను డిమాండ్ చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఆర్‌జి కార్ ఘటన సంబంధిత విషయంలో మమత సర్కారు తగు న్యాయానికి ఎటువంటి భరోసా కల్పించింది? డాక్టర్ల స్పందన ఏమిటీ? అనేది వెంటనే స్పష్టం కాలేదు. చర్చల తరువాత జూనియర్ డాక్టర్లు స్వస్థ భవన్‌కు వెళ్లారు. తాము వెంటనే సమ్మె విరమించుకోవడం లేదని, చర్చలు విజయవంతం అయ్యాయని డాక్టర్ల బృందం మీడియాకు తెలిపింది. సంఘం జనరల్ బాడీ సమావేశంలో చర్చించి నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు.సమావేశం సత్ఫలితాలను ఇవ్వకపోతే దీనిని మీడియాకు చెపుతామని జూనియర్ రెసిడెంట్ డాక్టర్ల ప్రతినిధి డాక్టర్ ఎస్‌కె మెహెబూబు హుస్సేన్ తెలిపారు. కాగా సిఎం నివాసం వెలుపలికి వచ్చిన డాక్టర్లలో ఓ బృందం తమకు న్యాయయం కావాలని డిమాండ్ చేసింది. మరో బృందం మీడియా వద్ద న్యాయం దక్కాల్సి ఉంది. అయితే తమకు రాజకీయాలు అవసరం లేదు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News