Tuesday, October 15, 2024

రేపటి నుంచి ప్రధాని కానుకల వేలం

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు, ఇతర సందర్భాలలో వచ్చిన పలు కానుకలు, అపురూప జ్ఞాపికలను నేటి నుంచి (మంగళవారం) వేలం వేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం తెలిపారు. సెప్టెంబర్ 17 మోడీ జన్మదినం,ఈ నేపథ్యంలో 17వ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకూ వేలం ప్రక్రియ ఉంటుంది. ప్రధానికి వచ్చిన పలు రకాల కానుకలు దాదాపు 600 వరకూ సాంస్కృతిక వ్యవహారాల కేంద్రం కార్యాలయంలో భద్రపర్చారు. కానుకలు , జ్ఞాపికలలో అనేక రకాలు ఉన్నాయి.

పారా ఒలంపిక్స్ విజేతలు బహుకరించిన స్పోర్ట్ షూస్, క్రికెటర్లు అందించిన బ్యాట్లు వంటివి అనేకం ప్రధానికి కానుకగా అందాయి. వెండి వీణ, రామమందిర ప్రతిమ , అపురూప కళాఖండాలు అనేకం వేలం పాటకు పెట్టారు. కానుకలలో రూ 600 నుంచి రూ 9 లక్షల విలువ చేసే పలు వస్తువులు ఉన్నాయి. వేలంలో పోటాపోటీ ఉంటుంది. ఈ క్రమంలో వీటి వేలం ద్వారా కనీసం రూ కోటిన్నర వరకైనా పలుకుతుందని సాంస్కృతిక శాఖ అధికారులు అంచనా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News