Tuesday, May 14, 2024

నేడు జడ్చర్ల, మేడ్చల్‌లో సిఎం సభలు

- Advertisement -
- Advertisement -

మళ్లీ దసరా తరువాత కెసిఆర్ ప్రచార సభలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దూకుడు పెంచారు. వరుసగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వా ద సభల పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.మంగళవారం సిరిసిల్ల, సిద్దిపేటలో జరి గిన బహిరంగ సభల్లో సిఎం కెసిఆర్ పాల్గొనగా, బుధవారం జడ్చర్ల, మేడ్చల్‌లో జరగనున్న బహిరంగ సభల్లో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు. కొంత విరామం ఇచ్చి దసరా పండుగ తర్వాత ఈ నెల 26 నుంచి మళ్లీ సిఎం కెసిఆర్ ప్రచారం కొనసాగనుంది. అక్టోబర్ 26 అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడులతో తిరిగి ప్రారంభం కాను న్న తొలిదశ ప్రచార పర్వం నవంబర్ 9వ తేదీన కామారెడ్డి సభ ముగుస్తుంది. సిఎం కెసిఆర్ ఒక్కో రోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటి స్తూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. తొలి విడతలో 40 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీల టికెట్లు… అభ్యర్థులు ఎవరు..? అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే ఆయా పార్టీల నుంచి బరి లో దిగనున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాలవారీగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్దం చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

అభ్యర్థుల ప్రచారంపై ఆరా తీస్తున్న అధినేత
బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే అభ్యర్థులకు బి.ఫాంలు అందజేయగా, నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచా ర సరళిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పార్టీ అభ్యర్థుల్లో ఎవరెవరు ఎలా ప్రచారం చేస్తున్నారో జిల్లా ల ముఖ్యనేతల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నట్లు సమాచారం. ప్రచారాన్ని ముమ్మరం చే యాలని, ప్రచారంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదని నేతలకు పార్టీ అధినేత ఆదేశించినట్లు తెలిసింది. అభ్యర్థులు పూర్తి సమయాన్ని ప్ర చారానికే కేటాయించాలని, సోషల్ మీడియాలో నూ ప్రచారంలో ముందుండాలని సూచించినట్లు సమాచారం. అభ్యర్థులు ఎన్నికల సామాగ్రిని పూ ర్తిగా సిద్దంగా ఉంచుకని, కార్యకర్తలతో సమన్వయంతో ప్రచారం నిర్వహించాలని చెప్పినట్లు తెలిసింది. ఇతర పార్టీలు అభ్యర్థులు ప్రకటించేలోగా బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారం ముందంజలో ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో ప్రతిరోజూ కీలకమే అని, అభ్యర్థు లు ఏమాత్రం అలసత్వం వహించినా ప్రచారంలో వెనుబడిపోతారని చెప్పినట్లు తెలిసింది. ప్రత్యర్థి వ్యూహాలకు దీటుగా అభ్యర్థులు వ్యూహాలు రూపొదించుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News