ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నేడు ఢిల్లీలో జరగబోయే ఇన్వెస్టర్స్ సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు – తాజ్ ప్యాలెస్ హోటల్ లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి.మర్ఫీతో సిఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 11:30 గంటలకు – బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే 12వ వార్షిక ఫోరంలో సిఎం ప్రసంగించనున్నారు. ఇక, మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కారల్స్ బర్గ్, కార్లైల్, గోద్రెజ్, ఉబెర్ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై విడివిడిగా సమావేశాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు – వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు, సీఈఓ, నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జ్ బ్రెండేతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దీంతోపాటు ఈ ఢిల్లీ టూర్ లో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు వివిధ అంశాలపై సిఎం చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలను కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
Also Read: శబరిమలలో బంగారం మాయం