Tuesday, April 23, 2024

నేను గేట్లు తెరిస్తే.. బిఆర్ఎస్ లో ఎవరూ మిగలరు: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కైయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో సిఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపిపై విమర్శలు చేశారు. 1969 ఉద్యమం ఖమ్మంలోనే పురుడు పోసుకుంది.. ఈ ఉద్యమం స్ఫూర్తితోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.ఈ జిల్లాకు కాంగ్రెస్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని.. 24 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేశారని తెలిపారు. మాటిస్తే సోనియా గాంధీ..వెనక్కి వెళ్లరన్నారు సిఎం.

ఈ ప్రాంతం నుంచి వచ్చిన భట్టీ, తుమ్మల, పొంగులేటి కేబినేట్ లో కీలకంగా ఉన్నారని… భూమిలేని పేదలను ఆదుకునే బాధ్యత మా పై ఉందన్నారు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని రేవంత్ చెప్పారు. రూ.400 సిలిండర్ ను రూ.1200లకు పెంచారని.. బిఆర్ఎస్, బిజెపి కలిసి పేద ఆడబిడ్డల సొమ్మును అప్పనంగా దోచుకున్నారని దుయ్యబట్టారు. మా ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే.. కెసిఆర్ కుటుంబం ఓర్వలేక మాపై శాపనార్థాలు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత మా ప్రభుత్వాన్ని కూలుస్తారంట.. బిజెపి, బిఆర్ఎస్ మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని.. ఎనిమిది స్థానాలతో బిజెపి ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ప్రశ్నించారు. మోడీ, ఖేడీలు కలిసి కుట్ర చేస్తే చూస్తూ ఊరుకోం.. మేము గేట్లు తెరిస్తే బిఆర్ఎస్ లో ఎవ్వరూ మిగలరన్నారు. రెండు పార్టీలు అవగహనతోనే సీట్లు ప్రకటించారని చెప్పారు. బిఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి.. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News